అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. లంగర్‌హౌస్‌లో బోనాల తొలిపూజ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అనంతరం లంగర్‌హౌస్ మార్కెట్ నుంచి గోల్కొండ కోట వరకు తొట్టెల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మంత్రులు బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. లంగర్‌హౌజ్‌లో తొలిపూజ సమయం లో బీఆర్ఎస్ నాయకులు స్టేజీపైకి వెళ్తుండగా పోలీసులు వారిని తోసేశారు.
– మెహిదీపట్నం, జూలై 16
మెహిదీపట్నం, జూలై 16: ఆషాఢ మాస బోనాల పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని మంత్రులు పొన్నం, కొండా సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా గోల్కొండ బోనాల కోసం 11 లక్షల చెక్కును ప్రభుత్వం తరఫున ఆలయ కమిటీకి మంత్రులు అందించారు. అనంతరం లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రథంలో ఉన్న అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలను సమర్పించారు. బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
తొట్టెల ఊరేగింపు లంగర్‌హౌస్ మార్కెట్, లంగర్‌హౌస్ చెరువు, ఫతే దర్వాజ, బడాబజార్, ఛోటా బజార్ మీదుగా గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. గోల్కొండ బోనాల కులవృత్తుల సంఘం సలహాదారు సాయిబాబాచారి, ఉపాధ్యక్షులు శ్రీకాంత్ చారి ఊరేగింపు చేపట్టారు. బోనాలు, తొట్టెలను గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయంలో సమర్పించడంతో తొలిబోనం పూజ ముగిసింది. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో అడిషినల్ కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్, గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ కాజల్ బందోబస్తును పర్యవేక్షించారు.
ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్,ప్రభుత్వ సలహాదారు వీహెచ్, ఎమ్మెల్యేలు దాన, నవీన్ యాదవ్, నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ చైర్మన్ నిరంజన్, దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంత్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి సలహాదారు సిరుగుమల్లె రాజువస్తాద్, గోల్కొండ జగదాంబిక మహంకాళి ఆలయ ట్రస్టు చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, బీఆర్ఎస్ యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, ఎంపీ ఈటెల రాజేందర్ తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అయితే బోనాల సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇక్కట్లకు గురయ్యారు. నీటి సమస్య, అపరిశుభ్ర వాతావరణం కనిపించింది.
బీఆర్ఎస్ నాయకులను తోసేసిన పోలీసులు
లంగర్‌హౌస్‌లో బోనాల ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి జీవన్‌సింగ్, నాయకులు అంబటి శ్రీనివాస్, చంద్రకాంత్, కోయల్ కార్ శ్రీనివాస్, జగదీష్ యాదవ్, కోయల్ కార్ గోవింద్రాజ్, కృష్ణదాస్‌ను పోలీసులు స్టేజ్‌పైకి వెళ్లకుండా తోసివేశారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.