కెనరా బ్యాంక్ లాభం 3,535 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికపు లాభంలో 75 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.3,535 కోట్ల లాభాన్ని గడించింది.
- నిరుడుతో పోల్చితే తొలి త్రైమాసికంలో 75 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, జూలై 24:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో గత త్రైమాసికపు లాభంలో 75 శాతం వృద్ధి నమోదైంది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను బ్యాంక్ రూ.3,535 కోట్ల లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇది రూ.2,022 కోట్లుగా ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.23,352 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.29,828 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొంది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.18,177 కోట్ల నుంచి రూ.25,004 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.98 శాతం నుంచి 5.15 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 2.48 శాతం నుంచి 1.57 శాతానికి దిగొచ్చాయి.
అలాగే బ్యాంక్ మొండి బకాయిలు రూ.2,673 కోట్ల నుంచి రూ.2,418 కోట్లకు తగ్గాయి. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ కే సత్యనారాయణ రాజు మాట్లాడుతూ…ఈ ఏడాది చివరినాటికి ఎన్ఐఎం 3 శాతానికి దిగిరానున్నదన్నారు. ఉద్యోగులు మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ది నమోదైందన్నరు బ్యాంక్ క్యాపిటల్ అడెక్సీసి రేషియలో 14.91 శాతం నుంచి 16.24 శాతానికి దిగొచ్చాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్ 1, టైర్ 2, టైర్ 3 బాండ్లను విక్రయించడం ద్వారా రూ. 7,500 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

