Canara Bank | రోజురోజుకు పెరుగుతున్న అధునాతన టెక్నాలజీతోపాటు సైబర్ దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘యాక్సిస్ బ్యాంక్’ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ సంగతి మరిచిపోక ముందే మరో బ్యాంకు సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయింది. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘కెనరాబ్యాంక్’ అధికారిక సోషల్ మీడియా అధికారిక ‘ఎక్స్’ ఖాతా ఈ నెల 22 (శనివారం) న హ్యాక్ అయింది.
ఏకంగా హ్యాండిల్ యూజర్ నేమ్ ‘ఎథర్.ఎఫ్ఐ (ether.fi)’గా మారిపోవడంతో ఖాతాదారులు, బ్యాంకు అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయినా ఈ విషయమై కెనరా బ్యాంకు ఎటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. కెనరాబ్యాంకు ఎక్స్ ఖాతాలో సుమారు 2.55 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఎక్స్ యాజమాన్యంతో నిత్యం సంప్రదిస్తూ తమ అధికారిక ఖాతాను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సంబంధిత టెక్నికల్ టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయని కెనరా బ్యాంకు తెలిపింది. ఖాతా హ్యాక్ అయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకూ కొత్త పోస్టులు రాలేదు. బ్యాంకు సైతం తమ ఎక్స్ పేజీలో ఎటువంటి పోస్టులు పెట్టొద్దని కెనరా బ్యాంకు తన యూజర్లను కోరింది.
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!
Bajaj CNG Bike | వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ముహూర్తం ఎప్పుడంటే..?!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!