బెంగళూరు, డిసెంబర్ 20:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..నూతన డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ‘కెనరా ఏఐ1పే’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాతాదారుడు వేగవంతంగా, భద్రంగా యూపీఏ ప్లాట్‌ఫాం కింద ఆర్థిక చెల్లింపులు జరుపడానికి వీలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త యాప్‌ను విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ యాప్‌తో ఖాతాదారుడికి సంబంధించిన ఈ ఖాతాతో అనుసంధనమైన దాని నుంచి ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్, బిల్ చెల్లింపులు, ప్రతిరోజు డిజిటల్ సర్వీసుల కోసం వినియోగించుకోవచ్చునని సూచించింది. లావాదేవీ పూర్తైన తర్వాత యూపీఐ పిన్ నంబర్ లేకుండానే యూపీఐ లైట్ ఫీచర్‌తో ఆర్థిక లావాదేవీలు జరుపుకోవచ్చునని వెల్లడించింది.