బెంగళూరు, నవంబర్ 29: కెనరా బ్యాంక్ దీర్ఘకాలిక మౌలికసదుపాయాల బాండ్ల ద్వారా 5 వేల కోట్ల నిధులను సమీకరించింది. వార్షిక కూపన్ రేటు 7.68 శాతంగా ఉన్నది. ఈ బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపింది.
ఇష్యూ సైజ్ రూ.1,000 కోట్లు కాగా, బిడ్లు మాత్రం రూ.12,450 కోట్లు వచ్చాయి.