Byju’s | ఎడ్యుటెక్ యాప్ బైజూస్ సంస్థకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ యూఎస్ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించడంతోపాటు బైజూస్ సారధ్యంలోని ఎడ్యుకేషనల్ గేమింగ్ సంస్థ ఓస్మో సీఈఓగానూ వ్యవహరించిన టాప్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ ఉపాధ్యక్షుడు చెరియన్ థామస్.. సంస్థకు గుడ్ బై చెప్పారు. అంతే కాదు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఇన్నోవేటివ్ కంపెనీ ఇంపెండింగ్ ఇంక్‌లో చేరారు.
హెడ్స్ అప్, క్లియర్, క్లాసిక్’ వంటి పాపులర్ యాప్స్ తయారీలో కీలకంగా వ్యవహరించిన ఇన్నోవేటివ్ కంపెనీ ఇంపెండింగ్ ఇంక్ సీఈఓగా నియమితులయ్యారు. ఇన్నోవేషన్స్‌లో అపారమైన అనుభవం గల చెరియన్ థామస్.. కొత్త సంస్థ ఇంపెండింగ్ ఇంక్ సీఈఓగా సంస్థ ఉత్పత్తులను విస్తరించడంపై కేంద్రీకరిస్తారు. గ్లోబల్ టాలెంట్ పూల్‌గా సంస్థను డెవలప్ చేస్తారు. నేపథ్యం, వ్యూహాత్మక చాతుర్యం, కార్యాచరణ ప్రణాళిక నైపుణ్యంలో పట్టు గల చెరియన్ థామస్.. ఇంపెండింగ్ ఇంక్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించనున్నట్లు తెలిపారు.
బైజూస్ ను ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీగా తీర్చిదిద్దడంలో చెరియన్ థామస్ కీలకంగా వ్యవహరించారు. బైజూస్ అనుబంధ సంస్థ ఓస్మో సీఈఓగా వ్యాపార విస్తరణలో కీలకంగా వ్యవహరించారు. 2017లో బైజూస్ తొలి అంతర్జాతీయ ఉద్యోగిగా నియమితులైన చెరియన్.. ఓస్మో వంటి సంస్థల టేకోవర్’తోపాటు బైజూస్’ను ప్రముఖ అంతర్జాతీయ సంస్థగా నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించారు.