
చెన్నై, నవంబర్ 30: ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల్ని కలిగిన వాహన సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) దేశంలో హైదరాబాద్తోసహా 8 నగరాల్లో డీలర్షిప్ల్ని విస్తరిస్తున్నది. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, కొచ్చి, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో డీలర్షిప్ల్ని ఏర్పాటు చేస్తుండగా, వీటిలో కస్టమర్లకు తమ ఎలక్ట్రిక్ ఎంపీవీ వాహనం ఈ6 సేల్స్, సర్వీసుల్ని ఆఫర్ చేయనున్నది.