న్యూఢిల్లీ, జూలై 11: చైనాకు చెందిన ఈవీల తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి ఒకేసారి మూడు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది. ఆట్టో 3 ఈవీల్లో భాగంగా డైనమిక్, ప్రీమియం, సూపీరియర్ వెర్షన్లలో ఈ మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో డైనమిక్ రకం రూ.24.99 లక్షలు కాగా, సూపీరియర్ రూ.33.99 లక్షలుగా నిర్ణయించింది.
ఈ కార్ల కోసం ముందస్తుగా రూ.50 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో 49.92 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన డైనమిక్ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 468 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే 60.48 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ప్రీమియం, సూపీరియర్ మాడళ్లు సింగిల్ చార్జింగ్‌తో 521 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.