హైదరాబాద్, ఆగస్టు 26: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బీవైడీ..భారత్‌లో తన మూడో అవుట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన షోరూంలో టీఎస్రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ ఈ జానయ్య ప్రారంభించారు. ఈ షోరూంను మోదీ గ్రూపు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీకి చెందిన రెండు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో కంపెనీ వాహనాలు ప్రదర్శించడంతోపాటు సర్వీసింగ్, ఈవీ చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మోదీ గ్రూపు ఎండీ నిహార్ మోదీ మాట్లాడుతూ..రాష్ట్ర కస్టమర్లకు అంతర్జాతీయ టెక్నాలజీతో తయారైన బీవైడీ పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను అందించాలనే ఉద్దేశంతో ఈ షోరూంను ప్రారంభించినట్లు చెప్పారు. చార్జింగ్ సదుపాయాలు మెరుగుపడుతుండటంతో వచ్చే రెండేండ్లలో ఈవీల విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశం ఉందన్నారు.