Bumble Layoffs : లేఆఫ్స్ తగ్గుముఖం పట్టి కొత్త ఏడాది కొలువుల కళ ఉంటుందని ఆశించిన వారికి నిరాశ ఎదరువుతోంది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్ధీకరణ వంటి పేర్లతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
లేటెస్ట్గా ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ 350 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు బాంబు పేల్చింది. రాబడి లేకపోవడంతో ఖర్చులకు కళ్లెం వేసే క్రమంలో కొలువుల కోత అనివార్యమని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులను తొలగించనున్నట్టు బంబుల్ వెల్లడించడంతో కంపెనీ షేర్ ధరలు ఏకంగా ఏడు శాతంపైగా నష్టపోయాయి.
మ్యాచ్ గ్రూప్ నుంచి బంబుల్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. తమ యాప్స్‌ను యువత వాడేందుకు బంబుల్ ప్రత్యర్ధులతో దీటైన పోటీ ఎదుర్కొంటోంది. ఇక టారిఫ్‌లు పెరగడంతో ప్రజలు ఖర్చు చేసేందుకు తటపటాయించడం కూడా కంపెనీని ఆర్ధిక కష్టాల్లోకి నెట్టింది. గడ్డుపరిస్ధితుల నేపధ్యంలో ఉద్యోగులను తగ్గించక తప్పని పరిస్ధితి బంబుల్ సీఈవో లిడియన్ జోన్స్‌కు ఎదురైంది.
Read More :
Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి