Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హంతకుడు గుండెపోటుతో మృతి
Rajiv Gandhi killer: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు సుతేంద్రరాజా అలియస్ శంతన్ చెన్నైలో మృతిచెందారు. రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో అతను ఒకడు. శ్రీలంక జాతీయుడైన శంతన్.. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ(Rajiv Gandhi killer) హత్య కేసులో నిందితుడు సుతేంద్రరాజా అలియస్ శంతన్ చెన్నైలో మృతిచెందారు. రాజీవ్ హత్య కేసులో జైలు నుంచి రిలీజైన ఏడు మంది ముద్దాయిల్లో అతను ఒకడు. శ్రీలంక జాతీయుడైన శంతన్.. కొన్ని రోజుల క్రితం చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.
ఇవాళ తెల్లవారుజామున 7.50 నిమిషాలకు అతనికి గుండెపోటు వచ్చినట్లు ఆస్పత్రి డీన్ డాక్టర్ వీ తేరనిరాజన్ తెలిపారు.కాలేయం దెబ్బతినడంతో చికిత్స కోసం అతను ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు చెప్పారు. వాస్తవానికి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు గుండెపోటు వచ్చినప్పుడు అతనికి సీపీఆర్ చేసినట్లు వెల్లడించారు. కానీ మళ్లీ 7.50కి పోటు రావడంతో అతను చనిపోయినట్లు చెప్పాడు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో సంతన్కు మరణశిక్ష పడింది. 1999లో సుప్రీంకోర్టు ఆ తీర్పును సమర్థించింది కూడా. సంతన్తో పాటు మురుగన్, పెరారివాలన్ కు కూడా మరణశిక్ష విధించారు. అయితే ఆ ముగ్గరికీ క్షమాభిక్ష పెట్టారు. దాంట్లో శంతన్ నవంబర్ 2022లో రిలీజయ్యాడు. 1991లో జరిగిన రాజీవ్ హత్య కేసులో.. తమిళ టైగర్స్‌కు శంతన్ ఓ ఇంటెలిజెన్స్ సభ్యుడిగా చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

