e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా.. డుగుడుగు బండికి డిమాండ్ పెరిగిందండి!

Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా.. డుగుడుగు బండికి డిమాండ్ పెరిగిందండి!

Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేస్త పా.. అని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పాట గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ పాట‌తో పాటు సోషల్‌ మీడియాలో ‘డుగుడుగు బండి’ అంటూ విపరీతంగా వైరల్‌ అవుతున్న బులెట్‌ వాహనానికి గ్రేటర్‌లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 8648 వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాగా.. ఒక్క ఆగస్టులోనే 1081 బండ్లు బుక్‌ అయ్యాయి. స్టైల్‌, సీసీ ఆధారంగా రూ.1.30 లక్షలకు పైగా ధర పలికే ఈ బండ్లకు ఇప్పుడు యమ క్రేజ్‌ ఉంది. పలు చిత్రాలు, జానపద గీతాల్లో ఈ బైక్‌లను వినియోగించి చిత్రీకరిస్తుండటంతో ఎంతో పాపులర్‌ కావడంతో పాటు ప్రతిఒక్కరూ మనసు పారేసుకుంటున్నారు. దీంతో అతి ఖరీదైన ఈ బైకులు జోరుగా అమ్ముడవుతున్నాయి.

యూత్‌ను ఎక్కువగా ఆకర్షించేది బైక్‌లే. కొత్త ఫీచర్లు.. కలర్‌ఫుల్‌గా కనిపిస్తే చాలు వాటిని ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని తహతహలాడుతారు. యువత ఆసక్తికి అనుగుణంగానే అనేక కంపెనీలు నూతన డిజైన్స్‌తో కూడిన బైక్‌లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, యమహా, హార్లీడేవిడ్సన్‌, కేటీఎం, బెనేల్లి, బీఎండబ్ల్యూ, సుజుకీ లాంటి కంపెనీల మోడల్స్‌ను యువత ఇష్టపడుతున్నారు. ఖరీదు ఎంతైనా స్టేటస్‌ కోసం వాటిని కొనేస్తున్నారు. అదనపు ఆక్సరీస్‌ జతచేసి అదిరే లుక్‌ తీసుకువస్తున్నారు.

బులెట్‌కు యమ క్రేజ్‌..

- Advertisement -

ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌లో వచ్చిన థండర్‌బర్డ్‌, హిమాలయన్‌, క్లాసిక్‌ మోడల్స్‌కు భలే క్రేజ్‌ ఉంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కాంటినెంటల్‌ జీటీకి యువత ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతున్నది.

650సీసీ.. 25 కిలోమీటర్ల మైలేజ్‌ సామర్థ్యంతో బ్లూ కలర్‌లో ఉన్న ఈ బైక్‌కు డిమాండ్‌ బాగుందని డీలర్‌ ప్రశాంత్‌ తెలిపారు. ఈ బైక్‌ ధర రూ.3.10 లక్షల వరకు ఉంది.

క్లాసిక్‌-350 సీసీ బైక్స్‌కు ప్రత్యేకంగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ లోగోలు అమర్చి ఉండటంతో వాటికి భారీ డిమాండ్‌ ఉంది. వాటి ధర రూ.1.89 లక్షలు.

ఇక యమహాలో వైజెడ్‌ ఎఫ్‌ఆర్‌15వీ3కి భలే క్రేజ్‌ ఉంది. దీని ధర రూ.1.40 లక్షలు. ఎక్కువగా సౌండ్‌ కోసమే యమహా బైక్‌లను యువకులు కొనుగోలు చేస్తున్నారు. యమహాలోనే ఎమ్‌టీ-15 బైకుల అమ్మకాలు కూడా బాగున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఇక కేటీఎం, బజాజ్‌లో కూడా కొన్ని మోడల్స్‌ యువతను ఆకట్టుకుంటున్నాయి.

అదిరిపోయే ఫీచర్లు..

లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న బైక్‌లకు అదనపు అందాలను జోడించేందుకు యువత వెనుకాడటం లేదు. ఎక్స్‌ట్రా ఫిట్టింగ్‌ కోసం అరవై వేల నుంచి లక్ష వరకు వెచ్చిస్తున్నారు. సైలెన్సర్‌ను మార్చి.. సౌండ్‌ అధికంగా వచ్చేలా కొంతమందిని బైక్‌లను మార్చేస్తుంటే.. మరికొంత మంది పెట్రోల్‌ ట్యాంక్‌ చుట్టూ అదనపు ఆక్సరీస్‌తో, అడ్జస్టబుల్‌ సీట్లు, ఆటోమేటిక్‌ లైట్లతో ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు.

బుక్‌ చేసుకుంటే మూడు నెలలకు డెలివరీ

యువతే మా కస్టమర్లు. వారి మూలంగానే లక్షల రూపాయలు విలువైన చేసే బైక్‌లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. సాధారణంగా పేరెంట్స్‌ ఇంత ఖరీదైన బైక్‌లను తీసుకోవడానికి ఇష్టపడరు. కారును కొనేందుకు ఆలోచిస్తారు. యువతకు నచ్చితే ఎంత ఖరీదైనా పట్టించుకోకుండా నచ్చిన బైక్‌ను కొంటారు. ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి బాగా క్రేజ్‌ ఉంది. ఈ బండ్లను బుక్‌ చేస్తే మూడు నెలల తర్వాత డెలివరీ చేస్తున్నాం.

-రవి కుమార్‌, డీలర్‌

స్టైలిష్‌ బైక్‌ అంటే ఇష్టం

ప్రత్యేకంగా ఉన్న బైక్‌ను చూడటానికి చాలా మంది ఇష్టపడుతారు. ముఖ్యంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బండి నుంచి వచ్చే సౌండ్‌తో అందరి అటెన్షన్‌ మనవైపే ఉంటుంది. ఆ క్రేజ్‌ భలే ఉంటుంది. ఇందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టాలని అనిపిస్తుంది. ఇతర బైక్స్‌తో పోలిస్తే మన బైక్‌ స్టైల్‌గా ఉండాలని ఎవరికైనా ఉంటుంంది. స్టేటస్‌కు అనుగుణంగా కొందరు బైక్‌లను కొంటున్నారు. నేను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కాంటినెంటల్‌ తీసుకున్నా.

– మధు

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Car prices rise | వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయా.. కార‌ణం అదేనా?!

Vehicle’s Insurance | వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. వెహికిల్‌ ఇన్సూరెన్స్‌లపై హైకోర్టు సంచలన తీర్పు

ఏడాదిలో ఇండ్ల ధరలు పెరుగుతాయ్‌

సెప్టెంబ‌ర్ 1న దేశీ మార్కెట్‌లో న్యూ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లాంఛ్‌!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement