సెప్టెంబర్ 1న దేశీ మార్కెట్లో న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లాంఛ్!

న్యూఢిల్లీ : భారత మార్కెట్లో సెప్టెంబర్ 1న న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లాంఛ్ కానుంది. సెప్టెంబర్ 1న మీ డేట్ బ్లాక్ చేసుకోండని రాయల్ ఎన్ఫీల్డ్ సంకేతాలు పంపింది. ఇదే రోజున 2021 ఆర్ఈ క్లాసిక్ 350 లాంఛ్ అవుతుందని కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినా సెప్టెంబర్ 1న ఈ బైక్ దేశీ మార్కెట్లో సందడి చేస్తుందనే సంకేతాలు అందుతున్నాయి. ఇదే రోజున ఆర్ఈ క్లాసిక్ 350 ధరను కూడా కంపెనీ వెల్లడించనుంది.
ఈ బైక్ 350 సీసీ ప్లాట్‌ఫాంతో పాటు జే-ప్లాట్‌ఫాం ఇంజిన్ వాడుతూ ఆర్ఈ మెటియర్ 350 పవర్‌తో వాహనదారులను ఆకట్టుకోనుంది. ఈ బైక్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాకపోయినా స్పై షాట్స్‌లో బైక్ ఫీచర్లు ఇవేనంటూ హంగామా సాగింది. అవుట్గోయింగ్ మోడల్‌కు భిన్నంగా 2021 ఆర్ఈ క్లాసిక్ 350 డిజైన్ ఉండదని తెలుస్తోంది. స్టైలింగ్‌లో కొన్ని మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే భారత్‌లో లాంఛ్ కానున్న బైక్‌లో వైర్-స్పోక్ వీల్స్, క్రోమ్ ఎగ్జాస్ట్, న్యూ కలర్ స్కీం, ట్రిప్పర్ నేవిగేషన్ పాడ్ వంటివి ఉండే అవకాశం ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

