న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి లాభాల్లోకి వచ్చింది. వరుసగా రెండోసారి మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.280 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.849 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 18 ఏండ్ల తర్వాత వరుస త్రైమాసికాల్లో లాభాలను ప్రకటించడం ఇదే తొలిసారని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు.
2007 తర్వాత వరుస త్రైమాసికల్లో లాభాలను నమోదు చేసుకోవడం విశేషమన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని గడించిన విషయం తెలిసిందే. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ సహాయ సహకారాలు అందించడం వల్లనే లాభాల్లోకి రాగలిగామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జే రవి తెలిపారు.