న్యూఢిల్లీ, జూన్ 20: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్..తాజాగా 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసుల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇంటింటికి బ్రాడ్‌బాండ్ సర్వీసులు అందించాలనే ఉద్దేశంతో తొలుత హైదరాబాద్‌లో ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులను ఆరంభించింది.
ఇప్పటికి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫిక్స్డ్ వైర్లెస్ సేవలు పొందాలంటే రెండింటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటిలో రూ.999కే 100 మెగాబైట్ పర్ సెకండ్(ఎంబీపీఎస్) ప్లాన్ కాగా,, రూ.1,499కి 300 ఎంబీపీఎస్ ప్లాన్‌ను అందిస్తున్నది.