RIL and TCS | దేశీయ స్టాక్ మార్కెట్లలో శుక్రవారం ముగిసిన ట్రేడింగ్‌తో టాప్-10 సంస్థల్లో ఏడు కార్పొరేట్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.61,79,028 కోట్లకు చేరింది. ఇక మార్కెట్ లీడర్ రిలయన్స్ ఎం-క్యాప్ రూ.15,14,017.50 కోట్లకు, టీసీఎస్ ఎం-క్యాప్ రూ.14,20,935.10 కోట్లకు చేరింది. దీంతో రిలయన్స్ రూ.15 లక్షల కోట్ల ఎం-క్యాప్ క్లబ్లో చేరితే.. టీసీఎస్ రూ.14 లక్షల కోట్ల స్థాయికి చేరుకున్నది. ఇక బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ మొత్తం రూ. 254,21,578.88 కోట్లకు చేరుకున్నది.
టాప్-10 సంస్థల్లో రిలయన్స్, టీసీఎస్ తర్వాత స్థానంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,72,362.42 కోట్లకు చేరింది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ. 7,21,244.78 కోట్లకు, ఎఫ్ఎంసీజీ మేజర్ హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,49,943.93 కోట్ల వద్ద స్థిర పడింది. తర్వాతీ స్థానంలో నిలిచిన ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.5,02,232.46 కోట్లు, హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం-క్యాప్ రూ. 4,98,290.05 కోట్లకు చేరింది.
గురువారం ట్రేడింగ్‌లో బీఎస్ఈలో ఇటు రిలయన్స్, అటు టీసీఎస్ రూ.14 లక్షల కోట్ల క్లబ్‌ను దాటేశాయి. రిలయన్స్ ఎం – క్యాప్ రూ.14.54 లక్షల కోట్లకు చేరుకోగా, రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ ఎం-క్యాప్ రూ.14.19 లక్షల కోట్ల మార్క్‌కు చేరుకున్నది. రూ.14 లక్షల కోట్లను టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అధిగమించడం ఇదే తొలిసారి.
తొలిసారి దేశంలోని ఏడు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లు దాటేసింది. టాప్-7 కంపెనీల ఎం-క్యాప్ రూ.61.28 లక్షల కోట్లుగా నిలిచింది. రెండు కంపెనీలు రూ.5 లక్షల కోట్ల మార్క్‌ను గురువారం దాటాయి. ఇక బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.252.68 లక్షల కోట్లు.
ఇంకా.. రిలయన్స్, టీసీఎస్ తర్వాత మూడో స్థానంలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.8.79 లక్షల కోట్లు. ఇన్షోపిస్ ఎం క్యాప్ రూ.7.16 లక్షల కోట్లు. హెచ్‌యూఎల్ ఎం-క్యాప్ రూ.6.57 లక్షల కోట్లు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.5.02 లక్షల కోట్లు. హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం-క్యాప్ రూ.5.01 లక్షల కోట్లు.
ఈ టాప్-7 కంపెనీల్లో రెండు ఐటీ దిగ్గజాలు.. రెండు బ్యాంకులు కాగా, మరొకటి ఫాస్ట్‌మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), ఇంకొకటి ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ. ఇక మార్కెట్ లీడర్‌గా ఉన్న రిలయన్స్ పలు రంగాల్లో సేవలందిస్తోంది.