హైదరాబాద్, జూన్ 20: బ్రిగేడ్ గ్రూపునకు చెందిన ప్రీమియం ఫ్లెక్సిబుల్, మేనేజ్డ్ వర్క్‌స్పేస్ బ్రాండ్ బజ్వర్క్.. హైదరాబాద్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. కొత్తగా హైటెక్ సిటీ సమీపంలోని ఔరో అర్బిట్ వద్ద 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని నెలకొల్పింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని నిర్వహించాలనే లక్ష్యంగా పెట్టుకున్న అందుకుతగ్గట్టుగా తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది.