హైదరాబాద్, జూన్ 16 : బొండాడ ఇంజినీరింగ్‌కు సోలార్ ఈపీసీ విభాగం నుంచి మరో అతిపెద్ద ఆర్డర్ లభించింది. ఎన్టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ నుంచి రూ.1,338 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఆర్డర్లో భాగంగా ఎన్టీపీసీ ఉత్తరప్రదేశ్‌లో నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్టులో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్సట్రక్షన్ నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు విలువ రూ.1,338 కోట్ల స్థాయిలో ఉంటుందని, దీనిని వచ్చే 18 నెలల్లో పూర్తి చేయాల్సివుంటుందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంతో బొండాడ ఇంజినీరింగ్ సోలార్ ఈపీసీ ఆర్డర్ బుకింగ్ 5.5 గిగావాట్లకు చేరుకోనుండగా, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఆర్డర్ బుకింగ్ కూడా 1.1 గిగావాట్లకు చేరుకోనున్నట్టు ప్రకటించింది.