హైదరాబాద్, ఏప్రిల్ 28 : రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.2,843 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది నమోదైన రూ.1,571 కోట్లతో పోలిస్తే ఆదాయంలో ఇంచుమించు రెండింతలు పెరిగింది.
అలాగే నికర లాభం రూ.113 కోట్ల నుంచి 86 శాతం వృద్ధితో రూ.211 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది. అలాగే మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.914 కోట్ల ఆదాయంపై రూ.63 కోట్ల లాభాన్ని గడించింది. రెన్యువబుల్ ఎనర్జీ, టెలికాం, రైల్వే విభాగాలు మెరుగైన పనితీరు కనబర్చడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు తెలిపారు.