న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..తాజాగా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయిం ట్లు పెంచింది. ఈ వడ్డీరేట్లు ఈ నెల 15 నుంచే అమలులోకి వచ్చాయని పేర్కొంది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.50 శాతానికి చేరుకున్నది. అలాగే ఒక్కరోజు, నెల రుణాలపై రేటు 7.90 శాతంగాను, 8.10 శాతానికి చేరుకున్నాయి. అలాగే ఆరు నెలల రుణాలపై రేటు 8.40 శాతానికి సవరించింది.