Tim Cook | భారత్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను యాపిల్ మంగళవారం ప్రారంభించనున్నది. స్టోర్ ప్రారంభోత్సవం కోసం కంపెనీ సీఈవో టిమ్ కుక్ ముంబయికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో పర్యటించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోనే ఫేమస్ ఫుడ్ అయిన వడపావ్‌ను రుచి చూశారు. బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్.. వడపావ్‌ను టిమ్ కుక్కు పరిచయం చేశారు. టిమ్ కుక్‌తో ఉన్న ఫొటోను మాధురి ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. ‘ముంబయికి వస్తే వడపావ్‌తో కంటే మంచి స్వాగతం గురించి ఆలోచించలేం’ అంటూ ట్వీట్ చేసింది. టిమ్ కుక్ స్పందిస్తూ తొలిసారిగా వడపావ్‌ను రుచిని పరిచయం చేసినందుకు మాధురీకి ధన్యవాదాలు తెలిపారు. రుచి అద్భుతంగా ఉందంటూ స్పందించారు.
ఇదిలా ఉండగా.. యాపిల్ కంపెనీ దేశీయంగా ఐఫోన్లను తయారు చేయడంతో పాటు కస్లమర్ల కోసం లైవ్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు స్టోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తొలి రిటైల్ స్టోర్‌ను యాపిల్ బీకేజీ పేరితో ముంబయిలో మంగళవారం ప్రారంభించనున్నది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉదయం 11 గంటల నుంచి అందుబాటులోకి రానున్నది. యాపిల్ కంపెనీ భారత్‌లో 25 సంవత్సరాలుగా పనిచేస్తోంది.
అయితే, వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నది. స్టోర్‌లో కస్టమర్లు యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు సేవలను వినియోగించుకోవచ్చు. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా లోకల్ ఆర్టిస్టులు, ఇన్నొవేటర్స్ను హైలెట్ చేస్తూ కంపెనీ ప్రత్యేకంగా ‘టుడే ఎట్ యాపిల్’ వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నది. ఇక ప్రారంభోత్సవం సందర్భంగా యాపిల్ బీకేసీ డిజైన్ సందర్శకులను ఆకట్టుకుంటున్నది. స్టోర్ డిజైన్ ముంబయి ఆర్కిటెక్చర్, జామెట్రీని ప్రతిబింబింపజేస్తున్నది.
Thanks @madhuridixit for introducing me to my very first Vada Pav — it was delicious! https://t.co/Th40jqAEGa
— Tim Cook (@tim_cook) April 17, 2023