Katrina Kaif – Range Rover | బాలీవుడ్ కథానాయిక కత్రినా కైఫ్ (Katrina Kaif) కార్ల గ్యారేజీలో మరో రేంజ్ రోవర్ (Range Rover) కారు జత కలిసింది. రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యూబీ ఆటో బయోగ్రఫీ (Range Rover LWB Autobiography) ఎడిషన్ కారును ఆమె సొంతం చేసుకున్నారు. దాని ధర సుమారు రూ.3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ముంబై విమానాశ్రయంలో కొత్త రేంజ్ రోవర్ కారుతో కత్రినా కైఫ్ దర్శనమిచ్చారు. పలు సోషల్ మీడియా వేదికల్లో దీనికి సంబంధించిన వీడియో అప్ లోడ్ చేశారు. ఆమె కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కార్లలో ఇది రెండోది కాగా, ఆమె కుటుంబానికి మూడో కారు. ఆమె భర్త – నటుడు వికీ కౌశల్ కూడా సొంతంగా మరో కారు కలిగి ఉన్నారు.
వైట్ కలర్‌తో వస్తున్న కారు రూ.3 కోట్ల (ఎక్స్ షోరూమ్) కు కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్ నంబర్ కూడా 8822 కావడం గమనార్హం. నాలుగేండ్ల క్రితం తొలి రేంజ్ రోవర్ ఎస్యూవీ కారును రూ.2.30 కోట్లకు కొనుగోలు చేశారు. దీని రిజిస్ట్రేషన్ నంబర్ కూడా 8822. పలువురు సెలబ్రిటీలు ప్రత్యేకించి కత్రినా కైఫ్ వంటి వారి వద్ద రేంజ్ రోవర్ కార్లు ఉండటం చాలా కామన్. జాన్వీ కపూర్, అనన్యా పాండే తదితర సెలబ్రిటీలు ఇదే రేంజ్ రోవర్ ఎస్యూవీ కార్లను సొంతం చేసుకున్నారు.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎడిషన్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజెనియం (Ingenium) పెట్రోల్ విత్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 388 బీహెచ్పీ విద్యుత్, 550 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం ఆరు సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 242 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. దీంతోపాటు 3.0 లీటర్ల టర్బో చార్జ్డ్, టాప్ స్పెక్ రేంజ్ రోవర్ ఎస్వీ 4.4 లీటర్ల వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో వస్తోంది. 3.0 లీటర్ల టర్బో చార్జ్డ్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 346 బీహెచ్పీ విద్యుత్, 700 ఎన్ఎం టార్క్, 4.4 లీటర్ల వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 523 బీహెచ్పీ విద్యుత్, 750 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
రేంజ్ రోవర్ కారు 13.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వైర్ లెస్లీ, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, రెండు 13.1 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్లు, 24 వే ఎగ్జిక్యూటివ్ రేర్ సీట్స్ విత్ హీటింగ్ అండ్ కూలింగ్ ఫంక్షనాలిటీ, 3డీ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మల్టీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉంటాయి.