Bolero Neo Limited Edition | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లోకి లిమిటెడ్ ఎడిషన్ కారు `బొలెరో నియో` తీసుకొచ్చింది. దీని ధర రూ.11.50 లక్షలుగా నిర్ణయించింది. బొలెరో ఎన్10 వేరియంట్ కంటే రూ.29 వేలు ఎక్కువ ధర పలుకుతున్నది. రేంజ్ టాపింగ్ ఎన్ 10 (ఓ) కంటే రూ.78 వేలు చౌకగా లభిస్తుంది. 1.5 లీటర్ల పవర్ఫుల్ ఇంజిన్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
బొలెరో నియో సెవెన్ సీటర్ ఎస్యూవీ. స్టాండర్డ్ వర్షన్ బొలెరోతో పోలిస్తే కొన్ని కాస్మొటిక్ మార్పులు చేశారు. బొలెరో నియో వీల్‌బేస్ 2680 ఎంఎం, 160 ఎంఎం మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. రూఫ్ స్కై-రాక్తో అప్‌గ్రేడ్ చేసిన బొలెరో నియో.. ఫాగ్‌లైట్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డే లైట్ రన్నింగ్ లైట్స్‌తోపాటు హెడ్‌ల్యాంప్ డిజైన్ చేశారు. రేర్ ఆఫ్ ది కార్ సిల్వర్ కలర్ పెయింటెడ్ స్పేర్ వీల్ కవర్‌తో వస్తున్నది.
డాష్‌బోర్డుపై 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తున్న బొలెరో నియోలో డ్రైవర్ హైట్ అడ్జస్టబుల్ సీట్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం కూర్చునేందుకు లుంబర్ సపోర్ట్‌తో వస్తున్నది. రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్ విత్ బ్లూసెన్స్ కనెక్టివిటీ యాప్, ఫస్ట్, సెకండ్ రోల్లో కూర్చునే ప్రయాణికులకు ఆర్మ్‌రెస్ట్, డ్రైవర్ సీట్ కింద స్టోరేజీ ట్రే ఒక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.