న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా ‘బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరుతో లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పండుగ సీజన్ సందర్భంగా ఈ ఆఫర్ తీసుకొచ్చామని, ఎటువంటి కనీస నిల్వ లేకుండా ఖాతాదారులు బ్యాంకింగ్ సేవల్ని పొందవచ్చని బీవోబీ తెలిపింది.
ఇతర ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా బీవోబీ లైట్ అకౌంట్లో నామమాత్రపు త్రైమాసిక సగటు నిల్వను కొనసాగిస్తే ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డు, అర్హులైన వారికి జీవితకాలపు ఉచిత క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్నట్టు బ్యాంక్ వివరించింది. ఇందుకోసం త్రైమాసికపు కనీస నిల్వ మెట్రో/అర్బన్ శాఖల్లో రూ.3,000, సెమీఅర్బన్ శాఖల్లో రూ.2,000, గ్రామీణ శాఖల్లో రూ.1,000 ఉండాలి.