న్యూఢిల్లీ : భారత్‌లో ప్రముఖ వేరబుల్ బ్రాండ్ బోట్ దేశీ మార్కెట్లో జియో సిమ్‌తో కూడిన లునార్ ప్రొ ఎల్టీఈ స్మార్ట్‌వాచ్‌ను (boAt Lunar Pro LTE smartwatch) లాంఛ్ చేసింది. లునార్ ప్రొ ఎల్టీఈ స్మార్ట్‌వాచ్ స్మార్ట్ఫోన్లను క్యారీ చేయకుండానే సీమ్‌లెస్ కనెక్టివిటీ కలిగిఉండే వెసులుబాటు కల్పిస్తుంది. కనెక్టివిటీ, సౌకర్యం విషయంలో బోట్ లునార్ ప్రొ ఎల్టీఈ స్మార్ట్‌వాచ్ గేమ్ ఛేంజర్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
జియో ఈ సిమ్‌తో యూజర్లు కాల్స్ చేయడంతో పాటు రిసీవ్ చేసుకోవడం, మెసేజ్‌ల ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో బిల్టిన్ జీపీఎస్ సిస్టమ్ జోడించారు. బోట్స్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్ వైబ్రాంట్ 1.39 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, ఫిట్నెస్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిట్నెస్ ట్రాకర్ వంటి హెల్త్ మానిటరింగ్ టూల్స్ ఉన్నాయి.
జియోతో భాగస్వామ్యం దేశంలో కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని తమ యూజర్లకు మెరుగైన సదుపాయం అందివస్తుందని బోట్ సీఎంఓ, సహ వ్యవస్ధాపకుడు అమన్ గుప్తా పేర్కొన్నారు. త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి రానున్న బోట్ లునార్ ప్రొ ఎల్టీఈ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి ఇతర వివరాలు తెలుసుకునేందుకు బోట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Read More :
Kiara Advani | ఆ డైలాగ్‌తో సిద్ధార్థ్‌కు పడిపోయా అంటున్న కియారా అద్వాణీ