న్యూఢిల్లీ, జూలై 19: దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను అందుబాటులోకి బీఎండబ్ల్యూ తీసుకొచ్చింది. చెన్నై ప్లాంట్‌లో తయారైన బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి వుంటుందని సూచించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు ధర రూ.46.90 లక్షల నుంచి రూ.48.90 లక్షల లోపు లభించనున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ కారుపై మూడేండ్లు లేదా 40 వేల కిలోమీటర్ల వరకు మెయింటెనెన్స్ వర్క్ ప్యాకేజీని అందిస్తున్నది.