హైదరాబాద్, మే 22 : లాజిస్టిక్ సేవల సంస్థ బ్లూ వాటర్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 27న ప్రారంభంకానున్న వాటాల విక్రయం 29న ముగియనున్నదని తెలిపింది. షేరు ధరల శ్రేణిని రూ.132-135గా నిర్ణయించింది.
రూ.10 ముఖ విలువ కలిగిన 30 లక్షల షేర్లను విక్రయించడం ద్వారా రూ.40.50 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.