Airtel | న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇంటికే సిమ్ డెలివరీ సేవలను అట్టహాసంగా ప్రారంభించిన ఎయిర్టెల్ ఈ సేవలను అర్థాంతంగా నిలిపివేసినట్టు తెలుస్తున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం మంత్రిత్వ శాఖ పలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
సిమ్ బుక్ చేసుకున్నవారికి వెంటనే అందించాలనే ఉద్దేశంతో ఎయిర్టెల్..బ్లింకిట్‌తో జతకట్టిన విషయం తెలిసిందే. సెల్ఫ్-కేవైసీ ప్రాసెసింగ్, ఇతర విషయాలపై టెలికం శాఖ పలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో ఈ సేవలను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు ఎక్స్‌లో వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు ఒకేసారి 15 నగరాల్లో సిమ్ డెలివరీ సేవలను ఏప్రిల్ 15న ప్రారంభించిన విషయం తెలిసిందే.