ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. అందులో భాగంగా ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ (ఇఎఫ్ఎ) క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి మొదటి అంతర్జాతీయ ప్రచారకర్తగా అర్జెటీనా ఫట్‌బాల్ స్టార్ లియొనెల్ మెస్సీని నియమించింది బైజూస్. ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు మెస్సీతో ఒప్పందం చేసుకున్నాం. మా గ్లోబల్ అంబాసిడర్‌గా మెస్సీతో ఒప్పందం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అతను జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. ఇప్పుడు విజయవంతమైన ఫుట్‌బాలర్‌గా ఎదిగాడు. అతడని చూసి చాలామంది స్ఫూర్తిపొందుతారు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ప్రోగ్రాం ద్వారా 55 లక్షల మందికి పైగా పిల్లలకు విద్యను అందిచాలన్నది మా ఉద్దేశం’ అని చెప్పింది బైజూస్ కో- ఫౌండర్ దివ్యా గోకుల్‌నాథ్.
వరల్డ్ కప్ అఫీషియల్ స్పాన్సర్ కూడా
ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 20న ప్రారంభం కాబోతోంది. ఖతార్‌లో జరగనున్న ఈ వరల్డ్ కప్‌కి బైజూస్ అధికార ప్రచారకర్తగా ఉంది. దాంతో, తమ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ క్యాంపెయిన్ని ఎక్కువ మందికి తెలిసేలా చేసేందుకు మెస్సీలో ఒప్పందం చేసుకుంది బైజూస్. అంతేకాదు తమ కంపెనీ జెర్సీ వేసుకన్న మెస్సీ ఫొటోని కూడా విడుదుల చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది మెస్సీని ఫాలో అవుతున్నారు. మెస్సీతో ఒప్పందం చేసుకుంది బైజూస్. ఈ ఒప్పందం ద్వారా మూడున్నర కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులకు బైజూస్ చేరువకానుంది.