హైదరాబాద్, డిసెంబర్ 28: టాటా ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన బిగ్‌బాస్కెట్..హైదరాబాద్‌లో స్టోర్‌ను ప్రారంభించింది. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో 4 వేల వరకు ఉత్పత్తులు లభించనున్నాయి. ముఖ్యంగా పర్సనల్ కేర్, బ్రాండెండ్ ఫుడ్స్, గృహోపకరణాలు, పండ్లు, కూరగాయలు, కిరాణా సరుకులు కూడా అందుబాటులో ఉంచినట్లు బిగ్‌బాస్కెట్ కో-ఫౌండర్ వీఎస్ సుధాకర్ తెలిపారు. వీటిలో పండ్లు, కూరగాయలను నేరుగా 30 వేల మంది రైతులనుంచి సేకరించి విక్రయిస్తున్నట్లు చెప్పారు.