Maruti Suzuki Swift | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన పాపులర్ మోడల్ హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గరిష్టంగా రూ.50 వేల వరకూ రాయితీ ఆఫర్ చేస్తోంది. వేరియంట్ల వారీగా స్విఫ్ట్ కారుపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల వరకూ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ చేస్తోంది. వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) వేరియంట్ కార్లు కొనుగోలు చేసేవారికి క్యాష్ డిస్కౌంట్ స్థానే తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన ‘బ్లిట్జ్ కిట్’ ఉచితంగా అందిస్తామని తెలిపింది.
స్విఫ్ట్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ పై రూ.25 వేలు, ఏఎంటీ వేరియంట్ మీద రూ.30 వేలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. కార్పొరేట్ కొనుగోలుదారులకు అదనంగా రూ.2,100 డిస్కౌంట్ తోపాటు సెలెక్టెడ్ ట్రిమ్స్ మీద రూ.19 వేల వరకూ డీలర్ ఎండ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
అయితే న్యూ స్విఫ్ట్ సీఎన్జీ వేరియంట్ కారుపై ఎటువంటి డిస్కౌంట్లు లేవు. కానీ బ్లిట్జ్ కిట్ ఫ్రీగా అందిస్తోంది మారుతి సుజుకి. గత మే నెలలో ఆవిష్కరించిన న్యూ స్విఫ్ట్ మోడల్ కారు ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో ఆకర్షణీయ డీల్ గా కనిపిస్తోంది. ఈ కారు ధర రూ.6.49 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.9.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నది. జడ్ సిరీస్ 3-సిలిండర్ ఇంజిన్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ మోడల్ లీటర్ పై 25.75 కి.మీ మైలేజీ అందిస్తోంది.