హైదరాబాద్, అక్టోబర్ 3: బిగ్”సి’ ‘దసరా ధమాకా’ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి మాట్లాడుతూ..ప్రస్తుత పండుగ సీజన్లో మొబైల్ కొనుగోలు చేసిన వారికి నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామన్నారు.
ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల వరకు మొబైల్ ప్రొటెక్షన్ ఉచితంగా అందిస్తున్నట్లు, అలాగే రూ.10 వేల వరకు తక్షణ క్యాష్ బ్యాక్, రూ.5,999 వరకు విలువైన ఖచ్చితమైన బహుమతితోపాటు ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండానే మొబైల్ కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కస్టమర్లకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు ఒప్పో మొబైల్‌ను కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రా ద్వారా రూ.10 లక్షలు నగదు గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది.