BHEL | నూఢిల్లీ, ఆగస్టు 26: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్ మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. అదానీ పవర్ నిర్మించతలపెట్టిన మూడు థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి రూ.11 వేల కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకు సంధించి అదానీ పవర్, తన సబ్సిడరీ సంస్థయైన మహాన్ ఎనర్జీ లిమిటెడ్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ఈ ఆర్డర్లో భాగంగా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లను సరఫరా చేయాల్సి ఉంటుందని బీఎస్ఈకి సమాచారం అందించింది. ఒక్కో ప్రాజెక్టు 2X800 మెగావాట్ల సామర్థ్యంతో అడ్వాన్స్డ్ సూపర్‌క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నది. రాజస్థాన్‌లో కవై ఫేజ్-2, కవై-ఫేజ్-3, మహాన్ ఫేజ్-3ని మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతున్నది.