భెల్‌కు 4 వేల కోట్ల ఆర్డర్
ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. రూ.4 వేల కోట్ల విలువైన ఆర్డర్‌ను మహాన్ ఎనర్జీ నుంచి పొందింది. అదానీ పవర్‌కు సబ్సిడరీ సంస్థే ఈ మహాన్ ఎనర్జీ కావడం విశేషం. 35 నెలల్లో పూర్తికానున్న బంధురా పవర్ ప్రాజెక్టు కోసం భెల్ విద్యుత్ పరికరాలను 31 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
హైదరాబాద్, ఆగస్టు 21: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల ఉత్పత్తి సంస్థ భెల్ మరో భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. రూ.4 వేల కోట్ల విలువైన ఆర్డర్‌ను మహాన్ ఎనర్జీ నుంచి పొందింది. అదానీ పవర్‌కు సబ్సిడరీ సంస్థే ఈ మహాన్ ఎనర్జీ కావడం విశేషం. 35 నెలల్లో పూర్తికానున్న బంధురా పవర్ ప్రాజెక్టు కోసం భెల్ విద్యుత్ పరికరాలను 31 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుందని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ ఆర్డర్లలో భాగంగా బాయిలర్లు, టర్బైన్లు, జనరేటర్లు, సూపర్విజన్ ఆఫ్ ఎరెక్షన్ పరికరాలను రెండు 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. వీటిలో బాయిలర్లు, టర్బైన్ జనరేటర్లను తిరుచి, హరిద్వార్ ప్లాంట్‌లో భెల్ తయారు చేయనున్నది. దీంతో భెల్ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. భారీ ఆర్డర్ రావడంతో కంపెనీ షేరు ధర 3.21 శాతం పెరిగి రూ.101.15 వద్ద ముగిసింది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేరు ధర 86 శాతం బలపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.35 వేల కోట్లకు చేరుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Adani Power
- BHEL
- Mahan Energen
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

