న్యూఢిల్లీ, నవంబర్ 28: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్‌కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.2,956 కోట్ల విలువైన ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్లో భాగంగా దేశీయ నౌకదళానికి 16 సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్, విడిభాగాలను సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపింది.
హరిద్వార్‌లో ఉన్న భెల్ ప్లాంట్‌లోనే చిన్న స్థాయి క్షిపణులు, యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ డిఫెన్స్ వెపన్లను ను తయారు చేసి ఇవ్వనున్నది.