న్యూఢిల్లీ, అక్టోబర్ 28: భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 3,593 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,341 కోట్ల లాభంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం ఎగబాకి రూ.41,473 కోట్లకు చేరుకున్నది.
మరోవైపు, కంపెనీ యాజమాన్యంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. గడిచిన 12 ఏండ్లుగా కంపెనీ ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ విఠల్‌కు ప్రమోషన్ లభించింది. జనవరి 1, 2026 నుంచి ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ప్రస్తుతం సీవోవోగా విధులు నిర్వహిస్తున్న శశ్వాత్ శర్మను కంపెనీ ఎండీ, సీఈవోగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.