న్యూఢిల్లీ, ఆగస్టు 9 : దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే లాభాల్లోకి వచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.6 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. అంతక్రితం ఏడాది సంస్థ రూ.342 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం రూ.1,734 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో నలిన్ నేగి మాట్లాడుతూ..గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను తిరిగి లాభాల్లోకి రాగలిగామని, గత కొన్ని నెలలుగా నిలకడైన వృద్ధిని నమోదు చేసుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థ నెలకు 45 కోట్ల యూపీఐ లావాదేవీలు ప్రాసెసింగ్ చేస్తున్నదన్నారు.