Mobility Expo | న్యూఢిల్లీ, జనవరి 17: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 శుక్రవారం ఇక్కడి భారత్ మండపంలో ఘనంగా మొదలైంది. తొలిరోజు విద్యుత్తు ఆధారిత (ఈవీ) వాహనాలదే పైచేయిగా నిలిచింది. ద్విచక్ర వాహన తయారీ సంస్థల దగ్గర్నుంచి మీడియం, లగ్జరీ లెవల్ కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను పరిచయం చేశాయి మరి. ఇక దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థ టాటా మోటర్స్ ఏకంగా 32 రకాల కమర్షియల్, ప్యాసింజర్ వెహికిల్స్‌ను ప్రదర్శించడం గమనార్హం.
అలాగే వాహన ప్రియులను ఎప్పట్నుంచో ఊరిస్తున్న క్రెటా ఈవీ మాడల్‌ను హ్యుందాయ్ దేశంలోకి తీసుకురాగా, బ్యాటరీ ఎలక్ట్రిక్ విటారాతో ఈవీ సెగ్మెంట్లోకి మారుతీ అడుగుపెట్టింది. గ్రీవ్ కాటన్ ైగ్జెబర్, ఎక్స్‌ప్రెస్ వాహనాలతోపాటు, ఈ-మోటర్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. సుజుకీ తమ తొలి ఈ-స్కూటర్ యాక్సెస్‌ను ప్రదర్శించింది. ఈ నెల 22దాకా ఈ ఎక్స్పో జరుగనున్నది.
బీఎండబ్ల్యూ ఎక్స్1 ఈవీ