న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను రూ.374.89 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.106.15 కోట్లతో పోలిస్తే మూడింతలు పెరిగినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.