Covaxin’s Quality fears | కరోనా మహమ్మారిని నియంత్రించడానికి రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ నాణ్యతపై సందేహాలకు భారత్ బయోటెక్ ఫుల్స్టాప్ పెట్టింది. ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్ల నాణ్యతను నియంత్రణ సంస్థలు పరీక్షించిన తర్వాతే వినియోగానికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపింది. అన్ని బ్యాచ్‌ల వ్యాక్సిన్లను హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో గల ప్రొడక్షన్ యూనిట్ నుంచే విపణిలోకి విడుదల చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటి వరకు సరఫరా చేసిన సుమారు ఏడు కోట్ల డోస్‌లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది.
తమ ఉత్పత్తి కేంద్రంలో ప్రతి బ్యాచ్ కొవాగ్జిన్ టీకాపై 200 పై చిలుకు నాణ్యత నియంత్రణ పరీక్షలు నిర్వహిస్తున్నామని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో తెలిపింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబోరేటరీ (సీడీఎల్)కు శాంపిల్స్ పంపుతున్నట్లు వివరించింది. సీడీఎల్ ఆమోదం లభించిన తర్వాతే మార్కెట్లోకి ఆయా బ్యాచ్ వ్యాక్సిన్లను విడుదల చేస్తున్నామని పేర్కొంది.
భారతదేశంతోపాటు ప్రపంచ దేశాలకు 20 ఏండ్లకు పైబడి కొన్ని వందల కోట్ల వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ధృవీక్రుతమైన, కఠినమైన జీఎంపీ (మంచి ఉత్పాదక పద్దతి)ని అనుసరిస్తూ వ్యాక్సిన్లను తయారు చేసి పరీక్షించిన తర్వాత విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. వ్యాక్సిన్ల నాణ్యత, సేఫ్టీపై రాజీలేని విధానాన్ని అమలు చేస్తున్నామన్నది. ఎల్లవేళలా టీకా తీసుకునే ఆరోగ్య కార్యకర్తల భద్రతే ప్రథమ ప్రాధాన్యం అని వివరించింది.
భారీ స్థాయిలో దేశీయంగా వ్యాక్సిన్‌ను అభివ్రుద్ధి చేసిన ఏకైక కంపెనీ తమదొక్కటేనని పేర్కొంది. గత 15 నెలల్లో 10 మ్యాగజైన్లలో వ్యాక్సిన్ గురించి ప్రచురణలు రావడం ప్రపంచ దేశాల్లో భారత్‌కు గుర్తింపును తెచ్చి పెట్టిందన్నది. కరోనా డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పని చేస్తున్న వ్యాక్సిన్ కొవాగ్జిన్ అని మూడవ క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందన్నది.
గత జూన్ నుంచి కర్ణాటకలోని మలూరు, గుజరాత్‌లోని అంక్లేశ్వర్లలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైందని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తయిన వ్యాక్సిన్లు సెప్టెంబర్‌లో వినియోగానికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వ్యాక్సిన్ ఉత్పత్తి, పరీక్ష, నియంత్రణ సంస్థల ఆమోదం, పంపిణీకి 120 రోజుల టైం పడుతుందని వివరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
SBI’s ‘Monsoon Dhamaka’ |హోంలోన్లపై ఎస్బీఐ ఆఫర్…!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
Amazon Big win on Reliance | సింగపూర్ కోర్టు ఆదేశాలకు కట్టుబడాల్సిందే..!
Richest Person: బెజోస్‌ను వెనక్కి నెట్టిన లూయీ విటాన్ అధినేత