సాధారణ సిటిజన్స్‌తో పోల్చితే సీనియర్ సిటిజన్ల పెట్టుబడులకున్న అత్యుత్తమ మార్గాలను ఒక్కసారి పరిశీలిస్తే వాటిలో..
1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
ఇదో కేంద్ర ప్రభుత్వ పథకం. పూర్తిగా రిస్క్ లేని రుణ సాధనం. 60 ఏండ్లు, ఆపై వయసువారి కోసమే తెచ్చారు. ప్రస్తుత వడ్డీరేటు 8.20 శాతం. కనీస పెట్టుబడి రూ.1,000, గరిష్ఠం రూ.30 లక్షలు. గరిష్ఠ కాలవ్యవధి 5 ఏండ్లు.
2. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం
తపాలా శాఖ అందించే ఈ స్కీంలో వార్షిక వడ్డీరేటు 7.40 శాతంగా ఉన్నది. కనీస పెట్టుబడి రూ.1,500. గరిష్ఠ పెట్టుబడి రూ.4.5 లక్షలు. జాయింట్ అకౌంట్లో రూ.9 లక్షలదాకా పెట్టుబడులు పెట్టవచ్చు. కాలపరిమితి 5 ఏండ్లు. మరో 5 ఏండ్లు పొడిగించుకోవచ్చు.
3. సీనియర్ సిటిజన్ ఎఫ్డీ స్కీం
60 ఏండ్లు, ఆపై వయసున్నవారికి రెగ్యులర్ ఇన్‌కమ్‌ను అందించడానికి బ్యాంకుల్లో వచ్చినదే ఈ స్కీం. కాలపరిమితి 7 రోజుల నుంచి 10 ఏండ్లు. వార్షిక వడ్డీరేట్లు 9.75 శాతం వరకున్నాయి. అత్యవసర పరిస్థితిలో ఎఫ్డీని వెనక్కి తీసుకోవచ్చు. అయితే జరిమానా ఉంటుంది.
4. ఫిక్స్డ్ డిపాజిట్లు
బ్యాంకుల్లో సాధారణ పౌరులతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలపై వడ్డీరేట్లు ఎక్కువగా లభిస్తాయి. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఎఫ్డీలలో పెట్టుబడులకు పన్ను మినహాయింపున్నది. ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదా చేసుకోవచ్చు.
5. సిస్టమ్యాటిక్ డిపాజిట్ ప్లాన్
సిస్టమ్యాటిక్ డిపాజిట్ ప్లాన్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్), ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) ఫీచర్లుంటాయి. ఒకేసారి పెద్ద మొత్తాల్లో డిపాజిట్లకు బదులు చిన్నచిన్న మొత్తాల్లోనూ డిపాజిట్లకు ఇందులో వీలుంటుంది. రూ.5వేలతో ఈ మంత్లీ డిపాజిట్లను ప్రారంభించవచ్చు. ఇక ఇందులో రెండు వేరియంట్లుంటాయి. ఒకటి సింగిల్ మెచ్యూరిటీ స్కీం, మరొకటి మంత్లీ మెచ్యూరిటీ పథకం. వీటిపై వార్షిక వడ్డీరేట్లు 8.50 శాతందాకా ఉన్నాయి. మదుపరులు ఏడాది నుంచి ఐదేండ్ల కాలపరిమితితో పెట్టుబడులు పెట్టవచ్చు.
6. మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడులు పెట్టే ముందే సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం మంచిది.
7. నేషనల్ పెన్షన్ సిస్టమ్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీం.
8. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
పీపీఎఫ్‌ల్లో పెట్టుబడి ఇన్వెస్టర్లకు ఏటా రూ.1.5 లక్షలదాకా పన్ను ఆదాకు అవకాశాన్నిస్తుంది. పీపీఎఫ్ ఖాతా పరిమితి 15 ఏండ్లు ఉంటుంది.
9. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు
ప్రభుత్వ రంగ కార్యక్రమాలు, ప్రభుత్వ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు ఈ బాండ్లను ప్రభుత్వం తరఫున జారీ చేస్తాయి. కాబట్టి ఇదో భద్రత కలిగిన పెట్టుబడి సాధనం.
10. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం అనేది ఓ ట్యాక్స్-సేవింగ్ మ్యూచువల్ ఫండ్ స్కీం. స్టాక్ మార్కెట్లు తదితర సాధనాల్లో పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది. తక్కువ రిస్కుతో ఎక్కువ రాబడులను అందుకోవచ్చు. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు.