Best Smart Phones | ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్లు భాగమయ్యాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అత్యధిక టెక్నాలజీ యూజర్ బేస్‌గా అవతరిస్తున్నది. ప్రతి ఒక్కరూ కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇండియన్స్‌లో గల విభిన్న ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి. ప్రత్యేకించి భారతీయులు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో రూ.10 వేల లోపు ధర గల బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందామా.. !
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. యూజర్ల కోసం నోకియా సీ32 ఫోన్ తీసుకొచ్చింది. ఈ ఫోన్ 4జీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ ఆండ్రాయిడ్ యూఐ వర్షన్‌తో వస్తున్నది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ గల నోకియా సీ32 ఫోన్ మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తున్నది. ఈ ఫోన్ రూ.8999లకే యూజర్లకు అందుబాటులో ఉంది.
షియోమీ అనుబంధ బ్రాండ్ రెడ్మీ ఇండియన్ యూజర్ల కోసం మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ తెచ్చింది. రూ.6299లకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో పలు బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 6.52-అంగుళాల హెచ్డీ + రిజొల్యూషన్‌తో వస్తున్నది. ఒక్టాకోర్ హెలియో జీ3 ప్రాసెసర్‌తో లభిస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ లభిస్తుంది. సింగిల్ చార్జింగ్ తో రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. తక్కువ ధరకే భారతీయులకు మరో స్మార్ట్ ఫోన్.. గెలాక్సీ ఎం4 తీసుకొచ్చింది. దీని ధర రూ.8,499 మాత్రమే. 6.5-అంగుళాల హెచ్డీ + డిస్ ప్లే తో వస్తున్న ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఫర్ ఫాస్ట్ చార్జింగ్ యూఎస్బీ టైప్-సీ కలిగి ఉంటుంది. డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్ 1080పీ వీడియో రికార్డింగ్ క్వాలిటీ కలిగి ఉంటది.
మరో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. భారత్ మార్కెట్లోకి గత నెలలో ఎంటరైంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా యూజర్లకు అందుబాటులో ఉంది. రూ.8499 ధరతో మార్కెట్లో ఉన్న ఈ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,249లకే సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ ‘మోటరోలా జీ13’ తెచ్చింది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంది. 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9999లకే లభిస్తుంది. ఫాస్ట్ 90 హెర్ట్జ్ డిస్ ప్లే, స్టీరియో స్పీకర్స్ సపోర్ట్ డోల్బీ ఆట్మోస్ తోపాటు మెరుగైన విజువల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుంది.
దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ ఏడాది క్రితం మార్కెట్లోకి వచ్చినా యూజర్లకు బెస్ట్ చాయిస్‌గా ఉంది. రూ.11,999లకు మార్కెట్లో ఆవిష్కరించినా ప్రస్తుతం రూ.9,699లకే అందుబాటులో ఉంది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ఇది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. తరుచుగా ఫోన్‌ను చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు.
భారత్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లలో రూ.10 వేల ధరకు బెస్ట్ ఫోన్ లావా బ్లేజ్2. యూనిసోక్ టీ616 ప్రాసెసర్, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. 6.5-అంగుళాల హెచ్డీ+ రిజొల్యూషన్ డిస్ ప్లే విత్ స్మూత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ అప్ టూ 18వాట్ల చార్జింగ్ ఆప్షన్ ఉంది.