బెంగళూర్ : మాస్ లేఆఫ్స్, పింక్ స్లిప్స్‌తో జాబ్ మార్కెట్ కుదేలవుతూ ఎటు చూసినా కొలువుల కోతలు కలవరపెడుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలు, మందగమనంతో టెక్ కంపెనీల (Tech Startup) నుంచి స్టార్టప్‌ల వరకూ ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. హైరింగ్స్ సైతం తగ్గుముఖం పట్టి ఉద్యోగాల కోసం యువత కండ్లు కాయలు కాచేలా ఎదురు చూడాల్సిన పరిస్ధితి నెలకొంది. ఆన్లైన్ ఓ జాబ్ రోల్‌కు టెక్నాలజీ స్టార్టప్ ఫౌండర్‌కు 48 గంటల్లో ఏకంగా 3000 రెజ్యూమ్‌లు వచ్చాయంటే జాబ్ మార్కెట్ దుస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.
పెద్దసంఖ్యలో రెజ్యూమ్‌లు రావడంతో స్ర్పింగ్వర్క్స్ వ్యవస్ధాపక సీఈవో కార్తీక్ మందవిల్లే షాక్ అయ్యారు. గత నెలరోజులుగా రెజ్యూమ్‌లు వస్తూనే ఉన్నాయని, ఇప్పటివరకూ కంపెనీ ఏకంగా 12,500 అప్లికేషన్స్‌ను రిసీవ్ చేసుకుందని చెప్పారు. శాశ్వతంగా రిమోట్ వర్కింగ్ ప్రాతిపదికన స్ప్రింగ్‌వర్క్స్ ప్రకటన ఇవ్వడంతోనే ఇంత భారీ రెస్పాన్స్ వచ్చిందని ఓ ట్విట్టర్ యూజర్ చెప్పుకొచ్చారు.
జాబ్ లిస్టింగ్స్‌లో రిమోట్ అనే పదం జోడించడం ద్వారా రెజ్యూమ్స్ పెద్దసంఖ్యలో వచ్చి ఉంటాయని చెబుతున్నారు. ఆన్ సైట్ వర్క్ అని ప్రకటనలో పేర్కొంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చి ఉండేవనే ప్రశ్న తలెత్తుతోంది. స్ప్రింగ్‌వర్క్స్ కెరీర్ వెబ్సైట్లో సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రోడక్ట్, టెక్నాలజీ సహా అన్ని ఓపెన్ పొజిషన్స్‌కు పర్మినెంట్ రిమోట్ అనే లేబుల్ జోడించారు. మెరుగైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం రిమోట్ వర్కింగ్‌కు మొగ్గుచూపాలని 2020 మే 6న కంపెనీ నిర్ణయించింది. స్ర్పింగ్వర్క్స్లో ప్రస్తుతం దాదాపు 200 మంది పనిచేస్తుండగా మున్ముందు కూడా రిమోట్ వర్క్ మోడల్‌ను కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది.
Read More :