హైదరాబాద్, మే 16: ఈవీ స్కూటర్ల విక్రయ సంస్థ బ్యూ4.. తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి షోరూంను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, చైర్మన్ ఉర్విష్ షా మాట్లాడుతూ..వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశవ్యాప్తంగా 100కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం సంస్థ స్టార్, షైన్, డొడొ పేర్లతో మూడు రకాల స్కూటర్లను రూ.74, 999 నుంచి రూ.1.2 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నాయి.