August Bank Holidays | గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే సాగుతున్నాయి. రూపాయి నుంచి రూ.లక్షల వరకూ క్షణాల్లో డిజిటల్ పేమెంట్స్ రూపంలో తేలిగ్గా జరుగుతున్నాయి. అయినా కస్టమర్లు ఒక్కోసారి బ్యాంకు శాఖను సంప్రదించాల్సి రావచ్చు. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి నిమిషం కూడా విలువైనదే. కనుక బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సదరు బ్యాంకు శాఖ తెరిచి ఉంటుందా..? లేక సెలవు పెట్టాలా? అన్న విషయాలు తెలుసుకున్నాకే బ్యాంకుకు వెళ్లే పని చూసుకోవాలి. ఇక 2024లో మరో నెల మరో మూడు రోజుల్లో చరిత్ర కాలగర్భంలో కలిసిపోతున్నది. గురువారం నుంచి ఆగస్టు నెల ప్రారంభం కానున్నది,
వచ్చే నెలలో ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు కలిపి మరో ఆరు రోజులకు బ్యాంకులకు జాతీయ సెలవు. ఇవి కాకుండా మరో ఏడు రోజులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి.. ఆ సెలవుల గురించి ముందస్తుగా బ్యాంకులు సమాచారం ఇస్తాయి.
ఆగస్టు 3 (శనివారం) – కెర్ పూజ – త్రిపురలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 8 (గురువారం) – టెండాంగ్ లో రమ్ ఫాత్ – సిక్కింలో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 3 (శనివారం) – ప్యాట్రియట్ డే – మణిపూర్ లో బ్యాంకుల మూత.
ఆగస్టు 4 (ఆదివారం) – దేశమంతా సెలవు
ఆగస్టు 10 (శనివారం) – రెండో శనివారం సందర్భంగా దేశమంతా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 11 (ఆదివారం) – దేశమంతా సెలవు
ఆగస్టు 15 (గురువారం) – దేశ స్వాతంత్ర్య దినోత్సవం లేదా పార్శీ నూతన సంవత్సరం – దేశంలోని బ్యాంకులన్నింటికీ సెలవు.
ఆగస్టు 18 (ఆదివారం) – దేశమంతా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 19 (సోమవారం) – రక్షా బంధన్ / ఝులానా పౌర్ణమి / బిర్ బిక్రమ్ కిశోర్ మానిక్యా బహదూర్ జయంతి – త్రిపుర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 20 (మంగళవారం) – శ్రీ నారాయణ గురు జయంతి – కేరళలో బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 24 (శనివారం) – నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
ఆగస్టు 25 (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 26 (సోమవారం)
ఆగస్టు 31 (ఆదివారం) – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
ఆగస్టు 26న సోమవారం జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ. దీంతో ఆగస్టు 24న నాలుగో శనివారం, 25న ఆదివారం తర్వాత సోమవారం కూడా సెలవు కావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవు. గుజరాత్, ఒడిశా, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, జమ్ము, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ పరిధిలో ఆగస్టు 24,25, 26 తేదీల్లో వరుసగా బ్యాంకులకు సెలవు ప్రకటించింది ఆర్బీఐ.