Bank Holidays | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. ఇతర సంస్థల మాదిరిగానే బ్యాంకులకు కూడా సెలవులు ఉంటాయి. కనుక నిత్యం బ్యాంకింగ్ లావాదేవీలు జరిపే వారు ఆయా బ్యాంకుల సెలవులు తెలుసుకుంటే అటువంటి వారు ప్లాన్ చేసుకోవడం తేలిక అవుతుంది. అలా కాకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఆగస్టు నెల ముగిసి సెప్టెంబర్ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల టైం మాత్రమే ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అవేమిటో ఓ లుక్కేద్దాం.. !
తేదీ —— సెలవు కారణం —————— సెలవు ఇచ్చిన ప్రాంతాలు
1 ——— గణేశ్ చతుర్థి (రెండోరోజు) —— పనాజీలో సెలవు
4 ——— ఆదివారం ————————- దేశమంతటా సెలవు
6 ——— కర్మపూజ ————————– రాంచీ
7 ——— ఫస్ట్ ఓనం ————————- కొచి, తిరువనంతపురం
8 ——– తిరు ఓనం ————————- కొచి, తిరువనంతపురం
9 ——– ఇంద్రజాత్ర ———————– గ్యాంగ్టక్
10 —— రెండో శనివారం —————— దేశమంతటా
11 ——- ఆదివారం ————————- దేశమంతటా
21 —— శ్రీ నారాయణ్ గురు ————- కొచి, తిరువనంతపురం
సమాధి దినోత్సవం
24 —— నాలుగో శనివారం —————- దేశమంతటా
25 —— ఆదివారం ————————- దేశమంతటా
గ్యాంగ్టక్లో సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ లావాదేవీలు జరుగవు. 9న ఇంద్రజాత సందర్భంగా బ్యాంకులకు సెలవు. 19న రెండో శనివారం, 10న ఆదివారం, 11న తిరిగి ఇంద్రజాత సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి. దీనివల్ల గ్యాంగ్టక్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.