Bank Holidays in October | చరిత్ర కాలగర్భంలో ఐదు రోజుల్లో మరో నెల కలిసిపోతున్నది. ఆదివారం నుంచి అక్టోబర్ నెల ప్రారంభం కానున్నది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండటంతోపాటు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల లావాదేవీలు డిజిటలైజ్ చేసినా, కొన్ని అంశాల్లో సంప్రదింపుల కోసం బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఆయా బ్యాంకులకు సెలవులు ఎప్పుడు ఉన్నాయో చెక్ చేసుకుని వెళ్లడం వల్ల సమయం వృధా కాదని చెబుతున్నారు. ఆర్బీఐతోపాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సెలవులను బట్టి బ్యాంకులు పని చేస్తుంటాయి. వచ్చేనెలలో బ్యాంకులు దేశవ్యాప్తంగా, వివిధ ప్రాంతాల్లో 16 రోజులు పని చేయవు.
వచ్చేనెలలో పలు పండుగలు వస్తుండటంతో బ్యాంకులకు సెలవులు ఎక్కువగా వస్తున్నాయి. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోతాయి. ఆదివారంతో ప్రారంభం అవుతున్న అక్టోబర్ లో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సాధారణ వారాంతపు సెలవులు. అంటే ఏడు రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు. అక్టోబర్ నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేయవో చూద్దాం.. !