Bank Holidays | మీరు సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు శాఖకు వెళ్లాల్సి రావచ్చు. అయితే, వారం ముందే బ్యాంకులకు ఇచ్చే సెలవులు, తదితర అంశాల గురించి జాగ్రత్త పడితే మంచిదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో 14,15 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. 16న అసోంలో, 17న ఆదివారం అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. అంటే గురువారం నుంచి నాలుగు రోజులు బ్యాంకులు పని చేయబోవని తెలుస్తున్నది.
ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి మహావీర్ జయంతి వైశాఖి తమిళనాడు నూతన సంవత్సర దినోత్సవం, బిజూ ఫెస్టివ్,, చీరాబోబా, బోహగ్ బీహూ వల్ల వివిధ రీజియన్లలో, ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడే, బెంగాల్ నూతన సంవత్సర దినోత్సవం, హిమాచల్ డే వల్ల ఆయా రాష్ట్రాల్లో బ్యాంకుల సేవలు అందుబాటులో ఉండవు. మెజారిటీ సెలవుల్లో కొన్ని మాత్రమే దేశవ్యాప్తంగా అమలవుతాయి.
ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పండుగల సందర్భంగా, జాతీయ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ బ్యాంకులు ఆయా రోజుల్లో మూసి ఉంచాల్సిందే. ఆర్బీఐ సెలవులను మూడు క్యాటగిరీల్లోకి విభజించారు. రాష్ట్ర పండుగలు, ప్రాంతీయ పండుగల సెలవులు, పండుగ సంబురాలుగా విభజించారు.