Banking System | బ్యాంకింగ్ వ్యవస్థపై ఢిల్లీ హైకోర్టు ఏమన్నదంటే?!
Banking System | భారత ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ సిస్టమ్ వెన్నెముక వంటిదని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Banking System | బ్యాంకింగ్ వ్యవస్థపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్ సిస్టమ్ వెన్నెముక వంటిదని పేర్కొంది. ఒక బ్యాంక్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటు చేసుకోవడాన్ని వదిలేయలేం అని స్పష్టం చేసింది. సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు ధృవీకరించింది. బ్యాంకు ఉద్యోగి లేదా అధికారి భక్తి శ్రద్ధలతో, సమగ్రతతో, నిజాయితీగా.. ప్రజలు లేదా డిపాజిటర్ల విశ్వాసం పొందేలా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేసింది.
2005లో ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న సమయంలో రూ.4.5 లక్షల విలువైన నోట్లు ముక్కలు ముక్కలయ్యాయి. అకస్మిక తనిఖీ చేసినప్పుడు రూ.100 విలువ గల 50 నోట్లు కనిపించకుండా పోయాయి. సంబంధిత అసిస్టెంట్ మేనేజర్ విధుల నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు, నేరం చేసినట్లు రుజువు కావడంతో ఆర్బీఐ ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించింది.
దీన్ని సదరు మాజీ అసిస్టెంట్ మేనేజర్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. సదరు అసిస్టెంట్ మేనేజర్‌కు ఉద్వాసన పలుకుతూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి బలవంతం కనిపించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

