న్యూఢిల్లీ, జూలై 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని తమ రిటైల్ కస్టమర్ల కోసం శుక్రవారం ఓ ప్రత్యేక మాన్సూన్ ఆఫర్‌ను ప్రకటించింది. ‘రిటైల్ బొనాంజా-మాన్సూన్ ధమాకా’ పేరుతో ఆగస్టు 1 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నది. ఇందు లో భాగంగా హౌజింగ్, కార్ లోన్లపై పూర్తిస్థాయిలో ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్టు బ్యాంక్ స్పష్టం చేసింది. అలాగే బంగారం తాకట్టుపై రూ.3 లక్షలదాకా తీసుకునే రుణాలపైనా ప్రాసెసింగ్ ఫీజును తొలగిస్తున్నట్టు పేర్కొన్నది. కేవలం 15 నిమిషాల్లోనే పసిడి రుణాలు మంజూరయ్యేలా తమ శాఖల్లో ‘గోల్డ్ లోన్ పాయింట్’ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది. ‘రాబోయే పండుగ సీజన్లో మా ఖాతాదారులకు ఈ ఆఫర్లు మరింత సొమ్మును ఆదా చేయగలవు’ అని ఈ సందర్భంగా బీవోఎం ఎండీ ఏఎస్ రాజీవ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
బ్యాంక్ ఆఫర్ విశేషాలు